
ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం..!ప్రపంచాన్ని నడిపించేది డ్రైవర్లే..!ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కునే సంస్కృతి వైసీపీ ది..!కూటమి సూపర్ సిక్స్- సూపర్ హిట్..!ఆటో డ్రైవర్ల ర్యాలీలో ఆటోను నడిపిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..!ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ 436 కోట్లు ఖర్చు.. కోటంరెడ్డి..!

ఉదయగిరి అక్టోబర్ 04 :(మనధ్యాస న్యూస్)://
ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో కూటమి నాయకత్వం ఆటోవాలా కదిలిందని,ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం తరుస్తుందని వారి సంక్షేమానికి 436 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయగిరి మండల కేంద్రంలోని గండిపాలెం సర్కిల్ నుండి ఆటో డ్రైవర్లు ఆటోలతో టిటిడి కళ్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆటోను నడిపి ఆటోవాలాలకు మద్దతుగా నిలిచారు. అనంతరం టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉదయగిరి టిడిపి మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, అధ్యక్షత వహించారు. ఆటో డ్రైవర్లను యూనియన్ నాయకులను, ముఖ్య అతిథులు నాయకులు, శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం టిడిపి అన్నారు.

పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని వర్గాలను సమతుల్యంగా సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 4 అనగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 15,000 చొప్పున అందిస్తుందన్నారు. ఆటో, మ్యాక్స్ క్యాబ్ ,మోటర్ క్యాబ్, డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 90 వేల 669 మందికి, 436 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా, 1406 మంది డ్రైవర్లకు రెండు కోట్ల 10 లక్షల 90 వేల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. ప్రపంచాన్ని నడిపించేది డ్రైవర్ల అని ప్రతి పనిలో డ్రైవర్లది ముఖ్యపాత్ర అని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో, పదివేల చొప్పున డ్రైవర్లకు ఇచ్చి, జరిమానాల ద్వారా 15,000 వేల రూపాయలు వసూలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇది కాకుండా గుంతల రోడ్లలో ఆటోలు మరమ్మతులకు గురై, సంపాదించుకున్న సొమ్ము రిపేర్లకు సరిపోయిందని తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి, సూపర్ సిక్స్ అమలు పరచలేరని, ప్రతి సభలో చెప్పారన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అభివృద్ధి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశారని, ఈ ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ఆహ్వానించడం, ఉదయగిరి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకోవడం, నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి అభివృద్ధిలో, నేను పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఒక కోటి 50 లక్షల రూపాయల, నుడా నిధులను వెచ్చించి వింజమూరులో డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయగిరి అభివృద్ధికి నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం ఉందని, సంపద సృష్టించే పనిలో, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిరంతరం శ్రమిస్తున్నారు. అందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్య పట్టణమైన వింజమూరు మండల కేంద్రంలో నుడా లేఔట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అందుకు కొన్ని శక్తులు అడ్డగిస్తున్నాయని అయినా అధికమిస్తామని తెలిపారు. దీని ద్వారా వచ్చే సంపదను అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు, భారత ప్రధాని నరేంద్ర మోడీ, సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్, కృషి చేస్తున్నారన్నారు. నిధుల లోటు ఉన్నప్పటికీ ఉదయగిరి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి చేస్తున్నట్లు కొనియాడారు. ఆటో డ్రైవర్ల అందరూ వారి కుటుంబ సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ చేసుకోవాలని కుటుంబానికి భరోసాగా నిలవాలని ప్రతి వృత్తిని వారు గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన ఆరాధ్య దైవం సినిమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణను స్మరించుకున్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ని స్థానిక నాయకులు ఆటోడ్రైవర్లు యూనియన్ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్, కదిరి రంగారావు, రాజకీయ కార్యదర్శి మాలేపాటి చైతన్య, రాష్ట్ర కార్యదర్శి ఎల్సి రమణారెడ్డి, మద్దసాని వెంకటేశ్వర్లు, మట్ల శాంతి, ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్ కే రియాజ్, సొసైటీ చైర్మన్లు, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, గడ్డం వెంకటేశ్వర్లు, అల్లిక మధు, గండిపాలెం ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడుసుమల్లి వెంకటసుబ్బయ్య, మండల కన్వీనర్లు, సీనియర్ నాయకులు ,గూడా నరసారెడ్డి, కప్ప ప్రభాకర్, చింతల శ్రీనివాసులు, పేలపూడి వెంకటరత్నం, ఉండేల గురువారెడ్డి, చండ్ర మధుసూదన్ రావు, బిజ్జం కృష్ణారెడ్డి, పోలినేని చంద్రబాబు, పులిగుంట్ల మధు మోహన్ రెడ్డి, తిరుమలరెడ్డి, బిజెపి అధ్యక్షులు విజయలక్ష్మి నారాయణరెడ్డి, కల్లూరి సురేందర్ రెడ్డి, కలివేల జ్యోతి, చికుర్తి రవీంద్రబాబు, చిదర్ల మల్లికార్జున, నియోజకవర్గంలోని తహసిల్దారులు, ఎంపీడీవోలు, ఆటో డ్రైవర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.