
తవణంపల్లి అక్టోబర్ 4 మన ద్యాస
వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె పంచాయతీ దేవళంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోలు పోసి తగుల పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం అధ్యక్షులు షణ్ముగం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గోర అవమానం జరిగిందని, గురువారం అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహం పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగుల బెట్టారని ఇది పిరికిపంద చర్య అని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దళితులు హక్కులను పూర్తిగా కోల్పోవాలనే దురుద్దేశంతో ఈ ఘటనకు పాల్పడ్డారని నిప్పు పెట్టిన దుర్మార్గులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ఆయన కల్పించిన హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.