
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాటిపర్తి వనజ, కార్యదర్శి జగదీష్ బాబు, సచివాలయం సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సర్పంచ్ తాటిపర్తి వనజ మాట్లాడుతూ, “గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి” అని పిలుపునిచ్చారు. అనంతరం చెత్త సేకరణ నెట్టెడు బండ్లను ప్రారంభించి, కార్మికులకు కొత్త దంతులు, పారలు, చీపుర్లు, డీసులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి జగదీష్ బాబు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, బిల్ కలెక్టర్ శ్రీనివాసులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.