
కొండాపురం అక్టోబర్ 2:(మన ధ్యాస న్యూస్ ):///
కొండాపురం ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ..తమ జీవితాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలని కొండాపురం టీడీపీ మండల కో-ఆర్డినేటర్ పోలినేని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిన పర్వదినం విజయదశమి అని, ప్రజలందరికీ పోలినేని చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయని, ఆ దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై పుష్కలంగా ఉండి, భక్తుల కోరికలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు.ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కి శ్రమిస్తున్న కాకర్ల సురేష్ పై ఆ పరంజ్యోతి కరుణాకటాకాలు మెండుగా ఉండాలని, అదే విధంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పరంజ్యోతి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని, విజయదశమి స్ఫూర్తితో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ముందుగా కొండాపురం ప్రజలకు, నాయకులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు పోలినేని చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.