పినపాక, మన న్యూస్:-పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు అంచనా వేసేందుకు బుధవారం నాడు దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్ మెంట్ సర్వే జరిగింది. దీనిలో భాగంగా మండల పరిధిలోని మొత్తం నాలుగు పాఠశాలల్లో న్యాస్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎంపీయుపిఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థులకు, మినీ గురుకులం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న 29 మంది విద్యార్థులకు, రాధిక కాన్సెప్ట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులకు, భాషా హైస్కూల్లో మూడో తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు, తొమ్మిదో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలను సీబీఎస్ఈ అబ్జర్వర్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ పాఠశాలల సిబ్బంది, నాలుగు కాంప్లెక్స్ ల సీఆర్ పీ ల ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో నేషనల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి కొమరం నాగయ్య న్యాస్ పరీక్షలు జరుగుతున్న పాఠశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాస్ పరీక్ష ఆధారంగానే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారిస్తారన్నారు. ప్రతి మూడేళ్ల కోసారి ఈ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు .న్యాస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీటిపై అత్యంత దృష్టి పెట్టి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసినట్లు తెలిపారు.