కర్మన్ ఘాట్, మన న్యూస్ :- ప్రజాపాలన విజయో త్సవాలను పురస్కరించి తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి దేవాదాయ శాఖ కమీషనరు వారు జారీచే సిన ఆదేశాల మేరకు బుధవారం రోజున శ్రీ కర్మన్ ఘాట్ హానుమాన్ దేవస్తానములో లోక కళ్యాణార్థము శ్రీగణపతి, మన్యుసూక్త సహిత సుదర్శన హోమము దేవాలయ అర్చకులచే ఘనంగా నిర్వహించరు.అనంతరం దేవస్తానములో వేంచేసియున్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎన్. లావణ్య,వేద పండితులు శ్రీ సి.హెచ్. ముత్యాల శర్మ, దైత పవన్ కుమార్,దేవాలయ ముఖ్య అర్చకులు శ్రీ అంబయ్య, పీతాంబరాచార్యులు,కె. సంతోష్ కుమార్, అంబా ప్రసాద్, మురళీధర్ శర్మ, సంతోష్ కుమార్ శర్మ, శ్రవణ్ కుమార్ శర్మ, ప్రవీణ్ కుమార్ చార్యులు,దేవాలయ సిబ్బంది ఎం. వెంకటయ్య,వేణు గోపాల్, సుజాత, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.