
మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 30: నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొని నిరసన తెలియజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు వి ఆర్ సి సెంటర్ అంబేద్కర్ బొమ్మ సర్కిల్ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నేతలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను.. కూటమి ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి..కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ....జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే.. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలలను తీసుకురావడం జరిగిందన్నారు.అందులో జగన్మోహన్ రెడ్డి ఏడు మెడికల్ కళాశాలను పూర్తిచేసి.. అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మిగిలిన 10 మెడికల్ కళాశాలలను మేము పూర్తి చేయలేము అని చెప్పి.. చంద్రబాబు నాయుడు వాటన్నిటిని ప్రైవేటుపరం చేస్తు తీసుకున్న నిర్ణయం దుర్మార్గమన్నారు.పేద విద్యార్థులకు వైద్య విద్యను..దూరం చేసేందుకే చంద్రబాబు నాయుడు.. ఇలాంటి.. అనాలోచిత నిర్ణయాలు చేస్తున్నారని మండిపడ్డారు.గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని, ఎయిడెడ్ విద్యావ్యవస్థని, వైద్య విధాన పరిషత్ ను ప్రభుత్వంలో విలీనం చేసి.. ఉద్యోగులకు బాసటగా నిలిచారని గుర్తు చేశారు.అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, నాడు నేడు కార్యక్రమం తీసుకువచ్చి ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా.. మౌలిక వస్తువులు కల్పించడం జరిగిందన్నారు.ఇలా అనేక రిఫార్మ్స్ ను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకురావడం జరిగిందన్నారు.ఆరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండాలనే ఉద్దేశంతో నూతన సంస్కరణలను తీసుకువచ్చారో ఆసంస్కరణలను ఈరోజు ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈరోజు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ..కూడ చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేసే విధంగా.. ఉద్యోగులను ఒక్కొక్కరిని ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు పంపిస్తూ వారిని అవమానానికి గురి చేస్తున్నారని అన్నారు.10 మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలంటే 23 సంవత్సరాలు పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పడం ప్రజలను మభ్య పెట్టడమేనన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలో తీసుకువచ్చి.. ఏకంగా ఏడు మెడికల్ కళాశాలలను ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు.ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను.. పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే.. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్న..అక్కసు తోనే చంద్రబాబు నాయుడు.. ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను.. చంద్రబాబు నాయుడు అప్పనంగా..వారి బినామీలైన ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తూ.. జేబులు నింపుకుంటున్నాడని అన్నారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేదంటే రాబోయే రోజుల్లో దీనిపై ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు.



