
మన ధ్యాస ,నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 30: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నందు ఉమ్మారెడ్డిగుంట లో మంగళవారం జీ.ఎస్.టీ. 2.0 సంస్కరణల పై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. జీఎస్టీ 2.0తో అన్నింటా రేట్లు తగ్గి సామాన్య ప్రజలకు ఊరట దక్కింది అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. స్థానిక వ్యాపారులకు, ప్రజలకు, దుకాణదారులకు జీఎస్టీ 2.0 ద్వారా కలిగే లబ్ధిని వివరించాము, జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం జీ.ఎస్.టీ. 2.0 సంస్కరణల ద్వారా దాదాపు 83 రకాల వస్తువుల ధరలు తగ్గాయి. అందులో పాల ఉత్పత్తులు, హార్డ్వేర్, బ్యూటీ ప్రోడక్ట్స్, నిత్యావసరాలు వంటి అన్ని రకాల వస్తువులు తగ్గడంతో పేద, మధ్య తరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల స్థానికంగా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , ఆర్థిక మంత్రి సీతారామన్ నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జి.ఎస్.టీ. 2.0 సంస్కరణలను సమర్థించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, 21వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చాన్ భాష, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి అంగన్వాడి అధ్యక్షురాలు చీకవోలు శాంతి, టిడిపి నాయకులు కంటే సాయి బాబా, కోటి రెడ్డి, ఖాదర్ భాష, కృష్ణ మోహన్ రెడ్డి, సురేష్ నాయుడు, ప్రకాష్, ప్రసాద్, మణికంఠ, టీ.శ్రీనివాసులు, సురేష్, ఆనంద్, బాలకృష్ణ, అనిల్, శివ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
