బడంగ్పేట్:-మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 6 లో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం పుల్లయ్య గురు స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.ఈ 18వ మహా పడిపూజ కార్యక్రమం కు స్థానిక కార్పొరేటర్ దీపికా శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గణపతి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ,లక్ష్మీ పూజ,శ్రీ అయ్యప్ప మహా పడిపూజ,స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు.శ్రీ అయ్యప్ప స్వామి 18వ పడిపూజ సందర్భంగా యాదగిరి గురు స్వామికి, పుల్లయ్య గురుస్వామి వారి శిష్య బృందం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు.అంతేకాకుండా స్వాములకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి,కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి, ప్రతాపరెడ్డి,రాజవర్ధన్ రెడ్డి, నర్సింహా గౌడ్ స్వామి ,వేణు స్వామి,శంకర్ గురు స్వామి,జానకి రెడ్డి గురు స్వామి,కన్నె స్వాములు తదితరులు పాల్గొన్నారు.