బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4
చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,బంగారు పాళ్యం మండలం,శేషాపురం గ్రామానికి చెందిన గుణ శ్రీ వయసు 12 సంవత్సరములు బంగారుపాళ్యం సెయింట్ మేరీ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నది. మంగళవారం మధ్యాహ్నం జ్వరం ఎక్కువ రావడంతో స్కూల్ యాజమాన్యం గుణ శ్రీ కి జ్వరం మాత్ర ఇచ్చి కొంత ఉపశమనం చేశారు. తరువాత సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తండ్రి రాజా వచ్చి గుణశ్రేణి ఇంటికి తీసుకువెళ్లాడు. తల్లిదండ్రులు రాజా భార్గవి ఎస్సీ కులస్తులు. కూలి జీవనం చేసుకుని బ్రతికేవారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఇంటికి వెళ్ళగానే జ్వరం మరింత ఎక్కువ కావడంతో వెంటనే బంగారు పాలెం ప్రైవేటు ఆసుపత్రికి వెంకయ్య డాక్టర్ దగ్గరికి వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వెంకయ్య ఇంజక్షన్ వేసిన కొంతసేపటికి స్పృహ కోల్పోవడంతో హుటా హుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు అప్పటికే మరణించినట్లు తెలపడం జరిగిందని వారి తల్లిదండ్రులు రాజా భార్గవి తెలిపారు. రాజా భార్గవికి ముగ్గురు కుమార్తెలు. ఇప్పటికే గతంలో ఒక కుమార్తె చనిపోగా, రెండవ కుమార్తెను పోగొట్టుకున్న బాధ గ్రామంలోను విషాదఛాయలు అలముకున్నాయి.