
ఎల్ బి నగర్. మన ధ్యాస ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధిలోని "స్వచ్ఛత హీ సేవా" కార్యక్రమంలో భాగంగా జాలోజికల్ సర్వే అఫ్ ఇండియా సౌతేర్న్ రీజియన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు గంగపురం కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జిహెచ్ఎంసి కార్మికులను శాలువాతో సత్కరించి, నగర పరిశుభ్రత కోసం మీరు చేసే ప్రతిరోజు కృషి ప్రశంసనీయం. మీ శ్రమ వల్లే మన నగరం ఆరోగ్యవంతంగా ఉంటుంది అని అభినందించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.స్వచ్ఛత అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం కూడా. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా రాబోయే తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలము. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరిన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలలో అవగాహన పెంచడానికి కృషి చేస్తానుఅని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సమా రంగారెడ్డి, రవీందర్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి, చింతల అరుణ సురేందర్ యాదవ్, నాయికోటి పవన్, కళ్లెం నావజీవన్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు, కార్మికులు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
