
శంఖవరం / ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కిర్లంపూడి లో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను రిటైర్డ్ ఎస్పి పిట్టా సోమశేఖర్ శనివారం ఆయన నివాసంలో కలిశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవలందించాలన్నారు. ముద్రగడ పద్మనాభం తో ఉన్న అనుబంధం మరవలేనిదన్నారు. వైసిపి నాయకులు చల్లా ప్రభాకర్ మాట్లాడుతూ నీతి నిజాయితీ గల నాయకుడు ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గౌతు స్వామి తదితరులు పాల్గొన్నారు.