
తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-26 : గ్రామీణ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ శుక్రవారం తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా ఉన్న దిగువమాగం సచివాలయం తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, రోగుల రిజిస్ట్రేషన్, ఔషధాల లభ్యత, పరిశుభ్రతా పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా మలేరియా నివారణ చర్యలు, దోమల నివారణ కార్యక్రమాలు ఎంతవరకు అమలవుతున్నాయి అనే అంశాన్ని ఆయన సమీక్షించారు. ఆరోగ్య కేంద్రం వైద్యుల సేవలను, సిబ్బందిలో సమన్వయాన్ని ప్రశంసిస్తూ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో డాక్టర్ కేశవ నారాయణ, డాక్టర్ ప్రియాంక, పి హెచ్ ఎన్ జీవకళ, సూపర్వైజర్ గోపి తదితరులు పాల్గొన్నారు.