
ఐరాల మన ధ్యాస సెప్టెంబర్-25 చిత్తూరు జిల్లా ఐరాల మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ స్థానిక కార్యకర్తలతో కలిసి పుత్రమద్ది గ్రామంలో 30వ బూత్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవితం, ఆలోచనలపై సభను నిర్వహించారు. అశోక్ మాట్లాడుతూ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం బిజెపి తత్త్వానికి పునాది అని, సమాజంలోని చివరి వ్యక్తి అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాధారణ ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ అసలైన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.