
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) :పెద్ద కొడప్ గల్ మండలం లోని చిన్న కొడపగల్ సొసైటీ పరిధిలోని కాటేపల్లి గ్రామానికి చెందిన సంఘ సభ్యుడు పిట్లం గంగబోయి మరణించడంతో,అతని కుటుంబానికి జేపీఏ ఇన్సూరెన్స్ పరిహారం అందజేశారు.ఈ సందర్భంగా రూ.2 లక్షల చెక్కును గంగబోయి భార్య పిట్లం సాయమ్మకు పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి,వైస్ చైర్మన్ గంగా గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ- సంఘ సభ్యుల భద్రత కోసం ప్రభుత్వం అందించే బీమా పథకాలు గ్రామీణ కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు.మరణించిన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ,
భవిష్యత్తులో ఇలాంటి పథకాల ద్వారా మరిన్ని కుటుంబాలు లబ్ధి పొందాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు పెంటయ్య, సాయగౌడ్, సంఘ సెక్రటరీ హనుమాన్లు పాల్గొన్నారు. అలాగే గ్రామ నాయకులు మల్లప్ప పటేల్, బోద్నం విట్టల్, గంగారెడ్డి, ఇస్మాయిల్, హాజీ నారా గౌడ్, మొగులయ్య, చోటకూరు శంకర్ తదితరులు హాజరయ్యారు.