
మన ధ్యాస ,నిజాంసాగర్ ,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు రోజా, నాగమణి, విజయలు చిన్నారులతో కలిసి బతుకమ్మను పూలతో అందంగా పేర్చి ఆడించారు. పూలతో అలంకరించిన బతుకమ్మను మహిళలు, పిల్లలు కలిసి ఘనంగా ఆడి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయం ప్రకారం బతుకమ్మను నిమజ్జనం చేశారు.
