
(మన ద్యాస న్యూస్ )ఉదయగిరి సెప్టెంబర్ 24 :////
ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రం నుండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి డబల్ లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శాసనసభలో తమ గళం వినిపించారు. మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీ సీ జనార్దన్ రెడ్డికి ప్రశ్నను సంధించారు.అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ బిషప్ ఓబులాపురం దేవప్రసన్న మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న అసెంబ్లీలో మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఉదయగిరి నుండి నెల్లూరు వెళ్లే నందవరం రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ఉదయగిరి నుండి నందవరం వరకు దాదాపు 29 కిలోమీటర్లు ఉంటుందని ఈ 29 కిలోమీటర్ల రోడ్డు సగం ఆత్మకూరు నియోజకవర్గం లోనూ సగం ఉదయగిరి నియోజకవర్గం లోను ఉంది ఈ రోడ్డు 50 సంవత్సరాలుగా ఇలాగే ఉంది అని ఈ రోడ్డు విషయమై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎమర్జెన్సీ కేసు నెల్లూరుకు తరలించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారని శాసనసభ్యులు గళంవిప్పారని దేవప్రసన్న అన్నారు ఉదయగిరి నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి నేటి వరకు జిల్లా కేంద్రానికి డబల్ లైన్ రోడ్డు లేదని ఉదయగిరి నుండి నందవరం వరకు 29 కిలోమీటర్లు పొడవైన రోడ్డును డబల్ లైన్ రోడ్డుగా ఏర్పాటు చేస్తే, రెండు హైవే లను కలపడమే కాకుండా, జిల్లా కేంద్రం నుండి నియోజకవర్గానికి డబల్ లైన్ రహదారి ఏర్పడుతుందని, అంతేకాకుండా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా కొంత భాగం ఈ రోడ్డు ఉందని, ప్రస్తుతం ఈ రోడ్డు పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని సభాపతి ద్వారా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్న మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని అడిగారు అని ఆనంద వ్యక్తం చేశారు. ప్రజల మేలు కోరే ఇలాంటి నాయకుడు ఈ రోజుల్లో ఎవరున్నారు అంటే అది కాకర్ల సురేష్ అన్నేనని ఇలాంటి నాయకుడు ఉదయగిరి నియోజకవర్గానికి దొరకడం హర్షించదగ్గ విషయమని ఉదయగిరి శాసనసభ్యులు నిజమైన నాయకుడని ప్రజల పట్ల మక్కువ కలిగినటువంటి నాయకుడని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు దేవుడు ఇచ్చిన వరమే అని ఈ సందర్భంగా చెప్పక తప్పదన్నారు ఎంతోమంది నాయకులు తమ పదవుల గురించి ఆలోచన ఉంటుంది కానీ ప్రజా నాయకుడైన ప్రజల మనిషి అయినటువంటి కాకర్ల సురేష్ అన్న నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకుడని దేవ ప్రసన్న అన్నారు