
తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-24 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మత్యం సచివాలయం పరిధి లోని, నల్లిచెట్టిపల్లె, మత్యం, తెల్లగుండ్లపల్లె గ్రామాలలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు తల్లి-బిడ్డ ఆరోగ్య పరీక్షలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధి స్క్రీనింగ్, సికిల్ సేల్ అనీమియా స్క్రీనింగ్, ఆయుష్ సేవలు, టీకాలు, మానసిక వైద్య సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహనవేలు, డాక్టర్ ప్రియాంక, కమ్యూనిటీ హెల్త్ అధికారి జ్ఞానశేఖర్, పి.హెచ్.ఎన్ జీవకళ, ఆరోగ్య పర్యవేక్షకులు డి.రాజశేఖర్, ఎన్.గోపి, బి.నిర్మలమ్మ, ఎస్.రెడ్డమ్మ, అలాగే ఆరోగ్యకార్యకర్తలు, ఏ.ఎల్.హెచ్.పిలు, ఏ.ఎన్.ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో డాక్టర్లు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబానికి పునాది అని, గర్భిణీలు, బాలింతలు, యువతులు, వృద్ధులు తప్పక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, గ్రామ ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
