
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): ఆరోగ్యమైన మహిళలతో పాటు ఆరోగ్యమైన కుటుంబాల అభివృద్ధికి తోడ్పడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాన్ని టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ ప్రారంభించారు. ఈ సంధర్భంగా సురేష్ మాట్లాడుతూ, నేటి సమాజంలో కరోనా అనంతర కాలంలో ప్రతీ వ్యక్తి ఏదోరకమైన, గమనించని అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారన్నారు. వీటిని అధిగమించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు వైద్య సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి, మెరుగైన వైధ్యమందించాలన్నారు. సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిదని, గర్భిణీలకు ప్రతీ నెలా 9వ తేదీన ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని, నేడు మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కూటమి ప్రభుత్వం స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడి కేంద్రాలు ద్వారా అందిస్తున్న పౌష్టికాహార శిబిరాన్ని పర్వత సురేష్ పరిశీలించారు.అనంతరం వైద్య శిభిరాల్లో మండల వైద్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్, వైధ్యులు మోహన్ సాయిరెడ్డి, రవి శంకర్, ప్రత్యేక వైద్య నిపుణులు నరేష్, శాంతి, పిహెచ్ సి వైద్య సిబ్బంది, ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొని మహిళలను పరీక్షించి, వైద్య సేవలందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిహెచ్ కుమార్, టిడిపి నేతలు బొర్రా వాసు, లచ్చబాబు, రౌతు శ్రీను, జట్లా శ్రీను, పడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.