(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: విశ్రాంతి ఉద్యోగులు విధిగా తమ లైఫ్ సర్టిఫికెట్లను 2025 ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రత్తిపాడు సబ్ ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని సబ్ ట్రెజరీ అధికారి ఎండి సలీం ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్తిపాడు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏలేశ్వరం మండలం విశ్రాంతి ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ దారులు తమ పెన్షన్లను బ్యాంకు ద్వారా పొందేందుకు తప్పనిసరిగా తమ లైఫ్ సర్టిఫికేట్లను జనవరి 1 2025వ తేదీ నుండి ఫిబ్రవరి 28, 2025వ తేదీలోగా తమ కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం ఖాన్ మాస్టారు, చిన్నప్రగడ సత్య గాంధీ, మజ్జితాపారావు, పి జోగురాజు, వెదురుపాక నారాయణరావు, గొడతా రామచంద్రరావు, వి పుల్లయ్య, సిహెచ్ రేవతి తదితరులు ఉన్నారు.