
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో, మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.నవరాత్రి ఉత్సవాలు ఈసారి మరింత ఘనంగా సాగుతున్నాయి. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోగా, అమ్మవారి ఆలయం ప్రాంతమంతా మంగళధ్వానాలతో మారుమోగింది.మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గామాతను కొలువు తీర్చారు.అమ్మవారికి శోభాయమానంగా అలంకరణలు చేసి, వేదమంత్రాలతో ఘనంగా పూజలు చేశారు. అనంతరం వేదపండితులు సంజీవరావు ఆధ్వర్యంలో గ్రామ యువకులు, భక్తులకు దుర్గామాత మాలాధారణ కార్యక్రమం జరిగింది.ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై భక్తిరసంలో మునిగిపోయారు.తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిచ్చేలా ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ..శరన్నవరాత్రి ఉత్సవాలు మా గోర్గల్ గ్రామానికి ప్రత్యేకగుర్తింపుతెస్తాయి.భక్తులందరూ సమిష్టిగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దఫెదర్ విజయ్.యువత తదితరులు ఉన్నారు.
