
కొండాపురం, సెప్టెంబర్ 21:(మనద్యాస న్యూస్ ):///
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు పంచాయతీలోని అగ్రహారం గ్రామానికి చెందిన తెలుగు యువత ఉపాధ్యక్షుడు బోగిరెడ్డి రవి ని తమ పంచాయతీ నాయకులే తప్పుడు కేసులు భానయించి ఇబ్బంది పెడుతున్నారని ఆదివారం రోజు తన నివాసంలో మీడియా మిత్రులకు తన ఆవేదన వెల్లడించారు. ఈ సందర్భంగా బోగిరెడ్డి రవి మాట్లాడుతూ టిడిపి పార్టీ కోసం అనేక కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొని నియోజకవర్గం టిడిపి విజయానికి సాయి శక్తులకు కృషి చేశానని ఆయన తెలిపారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పుడు నుంచి ఏ పార్టీ మారకుండా కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కోసం కరుడు గట్టిన అభిమానిగా పార్టీ కోసం కష్టపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం సొంత డబ్బులను ఆస్తులను పోగొట్టుకున్న అన్నారు. వైసిపి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎన్నో ధర్నాల్లో , రాస్తారోకోల్లో , పాల్గొని పార్టీ కి కష్టపడుతున్న తనను స్థానిక పంచాయతీ నాయకులే తనపై తప్పుడు కేసులు బనాయించి పైసాచిక ఆనందం పొందుతున్న తమ పార్టీ నాయకులు ఇదెక్కడ న్యాయం అంటూ తన ఆవేదనా వెలబుచ్చారు. అనగదొక్కేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆవేదం వెల్లబుచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.