
కనిగిరి సెప్టెంబర్ 20 (మన ధ్యాస న్యూస్) :///
కనిగిరి నియోజకవర్గం కనిగిరి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ ఇరిగినేని తిరుపతి నాయుడు 87వ జయంతి సందర్భంగా కనిగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు, కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా, పేదల పాలిటి పెన్నిధి గా, నియోజకవర్గ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి, నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మా పెద్దాయన ఇరిగినేని అని దారపనేని పేర్కొన్నారు. తూర్పు కోడిగుడ్లపాడు సీనియర్ టిడిపి నాయకులు,మాజీ ఎంపీటీసీ సభ్యులు చెనికల పెదమాల కొండయ్య, తూర్పు కోడిగుడ్లపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు నూతంగి నారాయణ, నూతంగి నరసింహారావు, గుర్రం రామసుబ్బారావు, చెనికల చిన్న మాల కొండయ్య, నాగేశ్వరరావు, గోగుల వెంకటేశ్వర్లు, బొడ్డు సుధాకర్, రవి తదితరులు ఘనంగా పెద్దాయన ఇరిగినేని కి ఘనంగా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.