
(ఉదయగిరి సెప్టెంబర్ 19 :(మన ద్యాస న్యూస్ )://
మండల కేంద్రమైన ఉదయగిరిలో సిహెచ్ఎస్ లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి ఆదేశాలతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న జన్మదిన వేడుకలు మన ఫౌండేషన్ సభ్యులు నిర్వహించడం జరిగింది కేకు కట్ చేసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తదుపరి ఆసుపత్రిలో ఉన్న రోగులకు జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంచి పెట్టడం జరిగింది తదనంతరం గాజుల రంతుజా సీనియర్ డాక్టర్ ఠాగూర్ అల్లూరి వెంకజ్యోతి వీరు మాట్లాడుతూ, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న,అభివృద్ధికి మారుపేరు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవడం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమే అని ఆయన ఆపద్బాంధవుడు ప్రజల మనిషి సహృదయుడు పేదల పెన్నిధి అని ఆయనను కొనియాడారు ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి వారికి అన్ని విధాల సహాయకుడిగా ఉంటూ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్న నాయకుడు కాకర్ల సురేష్ అని వారన్నారు.ఉదయగిరిలో పేదలకు వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం గమనించిన ఆయన సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునే శక్తి లేని పేదవారికి వైద్యం అందించాలన్న కాంక్షతో శిధిలావస్థలో ఉన్న పాత భవనాలను పడగొట్టి నూతన ఆసుపత్రి నిర్మించి పేదలకు అన్ని విధాల వైద్యం అందేలా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండేలా చేస్తున్నారని ఇలాంటి నాయకుడు మనకు దొరకడం ఉదయగిరి ప్రజలు చేసుకున్న పుణ్యమేనని వారు ఆయనను కొనియాడుతూ హర్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిడిఓ ప్రశాంత్ కుమార్, తమ సిబ్బంది మట్ల లక్ష్మయ్య, గాజుల బాబు, గాజుల సురేష్, మట్ల వెంకటేష్, ప్రసాద్,నారాయణ రెడ్డి,అంకయ్య,తదితరులు పాల్గొన్నారు.