మోడీ గారి నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
జలదంకి : సెప్టెంబర్ 17 :(మన ద్యాస) :///
జలదంకి మండల కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకలకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ –“మోడీ గారు ఒక దూరదృష్టి గల మహానాయకుడు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో సత్తా చాటుతూ, శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఆర్థిక, సాంకేతిక, రక్షణ, వ్యవసాయం, సంక్షేమం ప్రతి రంగంలో ఆయన చేసిన కృషి అప్రతిహతం” అని అన్నారు.మోడీ గారి ప్రగతిశీల దృక్పథంతో దేశవ్యాప్తంగా అనేక చారిత్రాత్మక పథకాలు అమలవుతున్నాయని ఆయన వివరించారు. వాటిలో ముఖ్యంగా:స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత విప్లవం,ఉజ్వల యోజన ద్వారా కోట్లాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు,మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టి,డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతికత ప్రతి ఇంటికి చేరవేయడం,జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించడం,ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఉచిత ఆరోగ్య సేవలు,ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక సాయం వంటి అనేక పథకాలు ప్రజలకు నేరుగా మేలు చేకూరుస్తున్నాయని వివరించారు.ఇక రాష్ట్ర అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చాతుర్యమైన పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారం, యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధునిక ఆలోచనలు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అమూల్యమని తెలిపారు.ఈ జన్మదిన వేడుకలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించగా, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు స్వయంగా పాల్గొని యువతను రక్తదానానికి ప్రోత్సహించారు. అనంతరం మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.