శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా శంఖవరం మండలం పరిధిలో ఉన్న శంఖవరం విద్యుత్తు సిబ్బంది కి సంబంధించిన విద్యుత్ ఎంప్లాయిస్ సిబ్బంది నిరసనగా దీర్ఘకాలి సమస్యలు పరిష్కరించలేదని దశలవారీగా ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించలేదని మొదటి దశలో 2 రోజు నల్ల బ్యాడ్జీలతో శంఖవరం విద్యుత్ కార్యాలయం పరిధిలో నిరసనలు తెలుపుతూ వారి డిమాండ్లు అనగా గ్రేడ్-2 జేఎల్ఎంలు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మరియు 1999 సంవత్సరం తరువాత నుండి వచ్చిన సిబ్బంది 2004 వరకు ఉన్న ఉద్యోగులను పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇలాంటి డిమాండ్లు దాదాపు 13 డిమాండ్లను మరియు కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు 6 ఉన్న సమస్యలను పరిష్కరించాలని జగ్గంపేట డివిజన్ జేఏసీ తరఫున కన్వీనర్ అయిన ఎన్ఎస్ నాయుడు మరియు తోటి మండల జేఈ అయినా భగతి కుమార్ మరియు సత్యనారాయణ మరియు మిగతా సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించాలని పరిష్కరించని ఎడల రాష్ట్రస్థాయి కంపెనీ స్థాయి మరియు జిల్లాస్థాయి జేఏసీ పిలుపు మేరకు తర్వాత పూర్తిస్థాయిలో బందుకు పిలుపునివ్వడం జరుగుతుందని ప్రభుత్వానికి మరియు ప్రజలకు హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.