కాకినాడ జిల్లాలో ప్రధాన కార్యాలయం ప్రారంభం..
దళిత ప్రజా సమితి వార్షికోత్సవం కరపత్రం ఆవిష్కరణ..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- రాష్ట్రవ్యాప్తంగా దళితుల పక్షాన్న దళిత ప్రజా సమితి ఉద్యమిస్తుందని దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో దళిత ప్రజా సమితి జిల్లా ప్రధాన కార్యాలయం మంగళవారం ప్రారంభించారు. అనంతరం అక్టోబర్ 10 వ తారీఖున శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో నిర్వహించు దళిత ప్రజా సమితి 3వ వార్షికోత్సవ కరపత్రాన్ని రాష్ట్ర మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రెండు రాష్ట్రాలలో బహుజనులు (ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ) పక్షాన్న ఎన్నో పోరాటాలు చేస్తూ, దళిత సమస్యలపై నిరంతరం ఉద్యమించడం జరుగుతుందని, కాకినాడ జిల్లాలో గల దళితుల అభివృద్ధికి మరింత తోడ్పడాలని దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా సభ్యులకు సూచించారు. అక్టోబర్ 10 వ తారీఖున జరగబోవు వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గునపర్తి అపురూప్ మాట్లాడుతూ, నిరుపేదల పక్షాన నిబద్దత కలిగిన నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల పరిష్కారాలపై ప్రశ్నిస్తూ దళితుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో గల దళితులందరూ దళిత ప్రజా సమితి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయ్యలని పిలుపునిచ్చారు. అనంతరం దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తిన తాతాజీ మాట్లాడుతూ, దళిత ప్రజా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో దళితుల పక్షాన అనేక సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, అక్టోబర్ 10 వ తారీఖున కాకినాడ జిల్లాలో జరగబోవు దళిత ప్రజా సమితి వార్షికోత్సవాన్ని జిల్లాలో గల దళిత నాయకులు,దళిత ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో దళిత ప్రజా సమితి ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొంగు రమేష్, రాష్ట్ర కోశాధికారి ఆకెళ్ళ అనంత్, రాష్ట్ర కోఆర్డినేటర్ చెక్క భీమరాజు, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు కానేటి వెంకటరమణ, జిల్లా సెక్రెటరీ మడికి శివ, జిల్లా కోశాధికారి గునపర్తి రాఘవ, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు గుడాల జాన్, జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు జెట్టి వెంకటరమణ (నాని) జగ్గంపేట నియోజకవర్గ సెక్రెటరీ తండు సుబ్బరాజు, తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.