

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యారంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినా ఈ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా, బిచ్కుంద మండలానికి చెందిన 29 మంది ప్రతిభావంతులైన ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించి ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఉపాధ్యాయుల పట్ల అభినందనలు తెలుపుతూ,వారు సమాజానికి,విద్యార్థులకు మానవతా విలువలు మరియు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు.
ఉపాధ్యాయులు ఉత్సాహంతో భవిష్యతు తరాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
