అనుమతులు లేవంటూ ఆరోపించిన మేకల కృష్ణ...
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రభుత్వం నుండి ఏ విధమైనఅనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్‌ను తరలిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మైనింగ్ మాఫియాను నిలుపుదల చేయాలని అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు కు శంఖవరం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మేకల కృష్ణ పిర్యాదు చేసారు. ఈ సంధర్భంగా కృష్ణ మాట్లాడుతూ, తుని నుండి శంఖవరం మీదుగా కత్తిపూడి వైపు తిరుగుచున్న అక్రమ మైనింగ్ లారీలకు ప్రభుత్వంలోని ఆయా శాఖల నుండి గాని, పంచాయతీల నుండి తీర్మానాలు గాని, అనుమతులు గాని లేవని, వీటిని సమాచార హక్కు చట్టం ద్వారా తగిన సమాచారం తాను సేకరించినట్లు కృష్ణ పేర్కొన్నారు. వీటివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దోపిడికి గురవుతుందన్నారు. తాను సంబంధిత అధికారులందరికీ ఇదివరకే పిర్యాదు చేసినా, వాటిని బుట్ట దాఖలు చేసారని, అందువల్లే అక్రమంగా మైనింగ్ తరలిస్తున్న లారీలు, దానికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నవరం ఎస్సై కు పిర్యాదు చేసినట్లు కృష్ణ తెలిపారు.