ప్రభుత్వ నిబంధనలకు పాతర.
వజ్రకరూరు మన ధ్యాస: గిరిజనుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వజ్రకరూరులో సోమవారం జరిగిన పీజీ ఆర్ఎస్ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం నాయక్ ఫిర్యాదు చేశారు.
నిబంధనలను అతిక్రమించి అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పి జి ఆర్ ఎస్ లో బంజారా సంఘం ప్రతినిధి ఎస్ కె సుబ్రహ్మణ్యం నాయక్ వజ్రకరూరు తాసిల్దార్ నరేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు సోమవారం నాడు వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామంలోని శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గిరిజన విద్యార్థులతో అధిక మొత్తంలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదులు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి తమ ఇష్టారాజ్యంగా పేదలతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ లాభార్జన గడిస్తున్నారని నాణ్యమైన విద్య కూడా అందజేయడం లేదని అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరగడంలేదని వాపోయారు స్కూలు నందు కనీస సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని అక్రమ వసూళ్లను ఆపాలని విజ్ఞప్తి చేశారు