జలదంకి :సెప్టెంబర్ 15 (మన ద్యాస న్యూస్) :
ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జలదంకి గ్రామంలో డ్రైవర్ వృత్తి చేసుకుంటూ నిన్న రాత్రి ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందడం జరిగింది. నీరుపేదలు అయినటువంటి శ్రీవర్ధన్ తల్లికి జనసేన పార్టీ తరుపున మట్టి ఖర్చులుకు 5000/- నియోజకవర్గం జనసేన పి ఓ సి కొట్టే వెంకటేశ్వర్లు గారు సహాయం చేసారు. అనంతరం వాళ్ళ స్థితిగతులు చూసి చలించిపోయి ఇంకా పక్కా నివాసలు లేకుండా ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నారా అని లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంత మందికి గ్రామంలో పక్కా గృహాలు లేవో తెలుసుకొని వివరాలు ఇవ్వాలని మండల నాయకులకు తెలిపారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేదలకు అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా పని చేస్తున్నారని ఎన్ డి ఏ కూటమి సభ్యులు కూడా వీలు ఉన్నంత వరకు పక్కా గృహాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా పని చేయాలనని చెప్పారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం జనసేన నేత నిమ్మలపల్లి రామ చైతన్య, మండల అధ్యక్షులు తోట మురళి, సొసైటీ డైరెక్టర్ జానీ, మనోహర్, మహీధర్, మహేంద్ర మరియు టీడీపీ యువ నేత వంశీ పాల్గొన్నారు.