మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తిరుపతి నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ కాగా, ఆదివారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ASP నాగేశ్వరరావు, పలువురు అధికారులు పుష్పగుచ్ఛం అందించి ఎస్పీకి ఘన స్వాగతం పలికారు…