సింగరాయకొండ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
మన దేశం న్యూస్ సింగరాయకొండ :-
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా, ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఈరోజు లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాం సుందరి మాట్లాడుతూ, వివాదాలను పరస్పర సమ్మతితో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదిక అని పేర్కొన్నారు. సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే జరిగే ఈ అవకాశాన్ని కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.అలాగే, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో, త్వరితగతిన మరియు సులభంగా న్యాయం అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆమె అన్నారు.కార్యక్రమానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ పి. సంజీవరెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వివిధ కేసుల్లో రాజీ ప్రయత్నాలు జరిపి పరిష్కారాలు సాధించబడ్డాయి.
కార్యక్రమం అనంతరం హాజరైన వారికి అల్పాహారం అందించారు