శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) :కష్టకాలంలో ఉన్న నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ శంఖవరం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి నిలుస్తున్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని నెల్లిపూడి గ్రామంలోని అంబేద్కర్ కాలనీ లో గల తిరగటి నూకరాజు ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీనితో నూకరాజు కుటుంబ సభ్యులు తిరగటి జగ్గయ్య, శివగంగ, రాణి లను జనసేన నేత తలపంటి బుజ్జి పరామర్శించి, 50 కేజీల బియ్యం తో పాటు నగదును ఆర్థిక సహాయంగా అందించి, బుజ్జి తన దాతృత్వం చాటుకున్నారు. కార్యక్రమంలో కోరాడ జాను, నొక్కే వీరబాబు, తలపంటి వీరబాబు, వెంకట్, కుక్క గోవిందు, పిర్ల నాని, జనసేన వీర మహిళలు, నేతలు పాల్గొన్నారు.