మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి రెగ్యులైజేషన్ చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అధారిటి (నుడా) అధికారులతో కలిసి కోవూరు గ్రామంలోని పివిఆర్ కల్యాణం మండపంలో శుక్రవారం నిర్వహించిన లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ......... అనధికారిక లే అవుట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడడమే కాకుండా ప్లాట్లు కొన్నవాళ్ళు కూడా నష్ట పోతున్నారన్నారు. గత ప్రభుత్వంలో కొందరు రియల్టర్లు అనధికారికంగా వేసిన లే అవుట్లలో ప్రజా పయోజనం వదలాల్సిన 10 శాతం స్థలం వదల లేదని వారికి అవగాహన కల్పించి 7 శాతం అపరాధ రుసుం కట్టించడంలో అధికారులు చొరవచూపాలని కోరారు.అక్రమ లేఅవుట్లను అరికట్టే విషయంలో ఆదిలోనే అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. అనధికారిక లే అవుట్లలో 90 శాతానికి పైగా గత ప్రభుత్వ హయాంలో వేసినవేనన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అక్రమ లే అవుట్ల నుంచి వసూలు చేసే అపరాధ రుసుం ద్వారా స్థానికంగా రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేస్తామన్నారు. లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు . అక్రమ లేఅవుట్లతో ఎదురయ్యే ఇబ్బందులపై అధికారులు చైతన్యపరచాలని ఆమె తెలిపారు. ఎల్ఆర్ఎస్ ను విజయవంతం చేయడంలో అధికారులు చొరవ చూపాలని అక్రమాలు సరిదిద్దుకునేందుకు ఎల్ఆర్ఎస్ అద్భుత అవకాశమన్నారు. రియల్టర్లతో పాటు ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, జెడ్ పి వైస్ ఛైర్మెన్ శ్రీహరికోట విజయలక్ష్మి, పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి, ఎంపిపి పార్వతి తో పాటు నుడా అధికారులు అల్లంపాటి పెంచలరెడ్డి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
బెడ్