మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. - మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరు పేట మండలం జగదేవి పేట గ్రామంలో 50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభోత్సవం మరియు మరో యాభై లక్షల నుడా నిధులతో నిర్మించనున్న డ్రైన్ల నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి జగదేవి పేట కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 50 లక్షల 15 ఆర్ధిక సంఘ నిధులు మరియు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఫండ్స్ తో నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభోత్సవ అనంతరం నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో కలిసి జగదేవిపేట గ్రామ పరిధిలో ఆమె 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ....... ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి తల్లికి వందనం, మత్స్యకారసేవలో, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేశారంటూ సిఎం చంద్రబాబు నాయుడు కార్య దక్షతను కొనియాడారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి మంత్రి లోకేష్ తన సమర్ధతను నిరూపించుకున్నారన్నారు.చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పల్లె పండుగ పేరుతొఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని గుంతల రహిత రాష్టంగా మార్చిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆదరాభిమానాలు చూరగొంటున్న స్త్రీశక్తి మహోన్నత సంక్షేమ పథకంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభివర్ణించారు. విజయదశమి కానుకగా ప్రభుత్వం ఆటో సోదరులకు 15 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించబోతున్నట్టు ఆమె తెలిపారు. ధనిక, పేద వ్యత్యాసం లేకుండా యూనివర్సిల్ హెల్త్ స్కీం ద్వారా రాష్టంలో ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య భీమా కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 14 నెలలో 14 సార్లు అనారోగ్య పీడితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక చేయూత నిచ్చిన మహోన్నత మానవతావాదిగా ఆమె సిఎం చంద్రబాబు నాయుడు ని ప్రశంసించారు. జగదేవి పేట గ్రామానికి కావాల్సిన రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎన్నికల సందర్భంగా యిచ్చిన హామీని దశల వారీగా అమలు చేస్తానన్నారు. `గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ళు, ఇళ్ల స్థలాల కేటాయింపులలో జరిగిన అవకతవకలను సరిదిద్ది త్వరలోనే అర్హులైన పేదల సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇందుకూరుపేట మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి, కుదురు రాధాకృష్ణారెడ్డి, కుదురు చంద్రారెడ్డి, బొల్లినేని రవి నాయుడు, హరినాయుడు, మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు.