శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ మహిళలు ఒక ఆదర్శం గా చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. రౌతులపూడి మండలం గంగవరం గ్రామానికి చెందిన ఏడిద గోవిందు గత కొన్ని నెలల నుంచి తీవ్ర అనారోగ్యానికి గురై కుటుంబ పరిస్థితులతో ఇబ్బందులను గుర్తించి వారికి సహాయం చేయాలని గంగవరం గ్రామ ఆడపడుచులు సంకల్పంతో ఏడద గోవిందు కుటుంబానికి రెండు నెలకు సరిపడ 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులతో పాటు వైద్యుల సూచనల మేరకు అవసరమైన ఆహారం కొరకు రాగులు జొన్నలు మరియు ఇంటికి రెండు నెలలకు సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది. కష్టకాలంలో ఉన్న మా కుటుంబానికి సహాయం అందించిన గంగవరం ఆడపడుచులకు రుణపడి ఉంటానని ఏడిద గోవిందు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గంగవరం గ్రామంలో ఆర్థిక పరిస్థితుల్లో సతమతమవుతున్న కుటుంబాలను గుర్తించి ఇప్పటికే పలు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందని, రానున్న రోజుల్లో మరెన్నో సహాయ సహకారాలు చేపట్టడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం ఆడపడుచులు మరియు వాడపల్లి బృందం పాల్గొన్నారు.