శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-
జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు సిఐ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో అన్నవరం పోలీసులు రోడ్డుపై ప్రమాదాల నివారించేందుకుగాను రేడియం స్టిక్కరింగ్స్ అతికించడం జరిగిందని అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ హరిబాబు తెలిపారు. ఈ మేరకు అన్నవరం గ్రామాన్ని ఆనుకుని ఉన్న జాతీయ రహదారి లో ఉన్న విద్యుత్ స్తంభాలకు రేడియం స్టిక్కర్స్ అన్నవరం పోలీసులు అతికించారు.
ఈ సందర్భంగా అన్నవరపు సభ్యులు ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ, వాహనాలు నడిపేవారు ఆజాగ్రత్తగా నడప రాదని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని, సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రతని వాహనదారులకు సూచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.