మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :-
సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి.వి.ఎస్. ప్రసాద్, సఖి వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ జ్యోతి సుప్రియ, పాకల సూపర్వైజర్ రిజ్వనా, సఖి పిఎఫ్ఓ గౌతమి పాల్గొన్నారు.వక్తలు విద్యార్థులకు చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్, బాల్య వివాహాల నిరోధం, మహిళా-శిశు సంక్షేమ శాఖ సేవలు గురించి అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య తలెత్తిన సందర్భంలో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ 181, పోలీస్ ఎమర్జెన్సీ 100 నంబర్లకు సంప్రదించి తక్షణ రక్షణ పొందవచ్చని సూచించారు.అలాగే సైబర్ నేరాలు, బాలలపై లైంగిక దాడుల వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.