మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు స్థానిక సింగరాయకొండ జడ్.పి. గర్ల్స్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు సిహెచ్. పల్లవి
డి. సుసాన్ గ్లొర్య్ఎంపిక అయ్యారు.తూర్పుగోదావరి జిల్లాలోని చాగోలు పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడం ద్వారా రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.వచ్చేనెల 26 నుండి 30 వరకు మధ్యప్రదేశ్ లో భోపాల్ లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె. మహాలక్ష్మి మరియు బోధన బోధనేతర సిబ్బంది వ్యాయామ ఉపాధ్యాయినులు కోటేశ్వరమ్మ ని మరియు లావణ్య నీఅభినందించారు.రాష్ట్ర జట్టుకు ఎంపిక అయిన ఇద్దరు విద్యార్థులకు ఒంగోలులోని అమృత హార్ట్ హాస్పిటల్ డాక్టర్ అయిన కేశవ్ రవాణా ఖర్చుల నిమిత్తం ₹5000/- ఆర్థిక సాయం అందించారు