ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యకర్తలు అభిమానుల మధ్య తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలు కొలహాలంగా జరిగాయి.మంగళవారం ఉదయం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం జనసేన అధ్యక్షులు జే అన్నవరం ఉపసర్పంచ్ కాలారీ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ నాయకుడు వరుపుల తమ్మయ్యబాబు తమకు సేవా గుణం నేర్పించారని ఆయన స్ఫూర్తితోనే ముందు సాగుతున్నామన్నారు. పుట్టినరోజు వేడుకలకు కొవ్వొత్తులర్పి కేకులు కత్తిరించే సంప్రదాయానికి స్వస్తి పలికి పలువురుకి సేవ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలారి సుబ్బారావు, తూర్పు లక్ష్మీపురం గ్రామ జనసేన అధ్యక్షులు వీరంరెడ్డి దొరబాబు, మర్రివీడు జనసేన గ్రామ అధ్యక్షులు భవాని శంకర్,పంతం చక్రవర్తి, కట్టా పండు కోలా వీరబాబు, కునపురెడ్డి దుర్గ బాబు, నడి కట్ల వెంకన్న ,పులి రాజు, ఎం. శ్రీను, అఖిల్, పసలసూరి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.