
కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 9: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ రోజు సూర్య ప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణలో తర్వాత స్వామివారిని మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి సూర్యప్రభ వాహనంపై ఉంచారు. శ్రీ వినాయక స్వామివారు సూర్య ప్రభ వాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, సూర్య ప్రభ వాహనం ఉభయదారులు పాల్గొని వాహన సేవను విజయవంతంగా నిర్వహించారు.