మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల గ్రామస్తులు గడచిన కాలంగా విద్యుత్ అందుబాటులో లేని పరిస్థితిని మన ధ్యాస వెలుగులోకి తీసుకువెళ్లింది.ఈ వార్తా ప్రచురణకు స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు సోమవారం వేగవంతమైన చర్యలు తీసుకొని,మరొక సమర్థవంతమైన ట్రాన్స్ఫార్మర్ను గ్రామానికి ఏర్పాటు చేశారు.ప్రస్తుతం హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా సజావుగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.గ్రామస్థులు ఈ పరిష్కారానికి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయగా,సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన మన ధ్యాస దినపత్రికకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.