మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 8: నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర పరిశీలకునిగా నియమితులైన వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు పలువురు వైసీపీ నేతలు సుధీర్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు సిటీ, మరియు రూరల్ నియోజకవర్గాల రాష్ట్ర పరిశీలకునిగా నన్ను నియమించడం ఎంతో సంతోషంగా ఉందని సుధీర్ రెడ్డి తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అదేశానుసారం పని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలలో మరింత బలోపేతం చేస్తా మని తెలిపారు.