మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 8: నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు, ఇమామ్, మౌజాన్లతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇమామ్, మౌజాన్ లకు వేతన బాకాయిలను, అలాగే గత వైసిపి ప్రభుత్వం లో ఇస్తున్న వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ నేతలు ఖలీల్ అహ్మద్ , హంజా హుస్సేనీ , సిద్ధిక్ , కరీముల్లా , సమీర్ ఖాన్ , మహబూబ్ భాషా , మస్తాన్ , యస్థాని , అలీమ్ తో జిల్లా కలెక్టర్ ని కలిసి మెమోరాండం అందజేశారు .ఇమామ్, మౌజాన్ లకు ప్రభుత్వం వేతనాలు నిలిపివేయడంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ కి వారి ఆవేదనను తెలియజేశారు.అనంతరం కలెక్టరేట్ బయట.. ముస్లిం మైనారిటీ నేతలు. ఇమామ్, మౌజాన్లతో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి , పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.........గత వైసిపి ప్రభుత్వం కంటే మిన్నగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని చెప్పి చంద్రబాబు ప్రజలందరినీ మోసం చేసిన విధంగానే ముస్లిం మైనార్టీలను కూడా చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు.ఇమామ్, మౌజాన్ లకు వేతనాలు పెంచుతామని చెప్పి ఈరోజు వారికి ఇచ్చే జీతాలు కూడా పూర్తిగా నిలిపివేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు.11 నెలల నుంచి వేతనాలు లేక ఇమామ్, మౌజాన్ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.ఈ రోజు అందుకు సంబందించి స్పందన కార్యక్రమంలో ఇమామ్, మౌజాన్ లు,మైనార్టీ నేతలతో కలిసి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఇమామ్, మోజాన్లకు వెంటనే వేతనాలు వేతన బకాయిలు చెల్లించాలని లేదంటే వైఎస్ఆర్సిపి పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముస్లిం మైనార్టీ నేతలు, ఇమామ్, మౌజాన్లు పాల్గొన్నారు.