మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
రైతులకు యూరియాను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యక్రమం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ విమర్శించారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న టాక్సీ స్టాండ్ వద్ద అన్నదాత పోరు పోస్టర్లను టౌన్ వైసీపీ నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎరువులు కొరత ఏర్పడిందని,రైతులకు సరిపడా పంపిణీ కావడం లేదని ఆరోపించారు.గత వైసీపీ ప్రభుత్వంలో ఎరువులు కొరత లేదని,కూటమి ప్రభుత్వం రాగానే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రశ్నించారు.జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి సామంతుల సూర్య కుమార్,జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు మాట్లాడుతూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదన్నారు.అందుకని ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి సత్వరమే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడానికి ఈ నెల 9వ తేదీ వైసిపి అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డివో కార్యాలయం వద్ద నిరసన చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ దలే కిషోర్,కో ఆప్షన్ మెంబెర్ వాగు బలరాం,కోరాడ ప్రసాద్,జువ్విన వీర్రాజు,మాజీ కౌన్సిలర్లు వాడపల్లి శ్రీను,గొడుగు నాగేంద్ర కుమార్,నాయకులు రాచర్ల రమేష్,పేకల జాన్,డేగల చంద్రమౌళి,సిరిపురపు రాజేష్,జెడి ధనబాబు సేసెట్టి శ్రీనుచందక శేషు, పతివాడ జగదీష్,ఆకుల ఆనంద్, లోగీసు శేఖర్,దత్తి రాజా తదితరులు పాల్గొన్నారు.