(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: పట్టణంలోని స్వామి దయానంద ఆశ్రమంలో డొక్కా సీతమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ కుమార్తె చాతుర్య జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆశ్రమంలో పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసి పిల్లలతో కేక్ కట్ చేయడం అనంతరం చాతుర్య పేరు మీద మొక్కలు నాటడం జరిగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వారిని నేనున్నానంటూ అన్నగా నిలుస్తున్న డొక్కా సీతమ్మ సేవాసమితి సభ్యులు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కుర్ర గోవిందు, మెల్లిపాక నాగేంద్ర, నడికట్ల వెంకన్న, బాలిశెట్టి శ్రీను, సిరి ఫుడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.