చిత్తూరు, సెప్టెంబర్ 7: (మన ద్యాస):///
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు, మునిస్వామి నాయుడు గారి మనవరాలు శ్రీమతి జానకి గారు, ఆమె భర్త తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షుడు శ్రీ చక్రవర్తి గారు కలిసి తిరుత్తని లోని వారి నివాసంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన అంశాలను చర్చించారు.అనంతరం వారు చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకొని మున్సిపల్ పార్క్‌లోని ప్రతిష్టకు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారిని ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. బొల్లినేని మునిస్వామి నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజాసేవలను స్మరించుకుంటూ, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలతో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమం ద్వారా నాయుడు గారి సేవలను యువతకు పరిచయం చేయడం, ఆయన ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు.