

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.
గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్కు 80 శాతం పైగా కనెక్షన్లు కలపడంతో,దాని సామర్థ్యానికి మించి లోడు పడుతోంది.ఈ సమస్యను అనేకసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో దానికి తోడు మరొక ట్రాన్స్ఫార్మర్ ను
బిగించారు.కలెక్షన్ ఇవ్వగానే కాలిపోవడంతో విద్యుత్ అధికారులు అలానే వదిలేసి వెళ్లిపోయారు అప్పటినుంచి ఇప్పటివరకు అధికలోడు పడడంతో ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ ను ఆన్ ఆఫ్ చేస్తున్న కానీ అధికలోడుతో ఉండడంతో విద్యుత్ సమస్య అలానే ఉంది ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి సమాధానమని చెప్పవచ్చు.గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
