శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:-
సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ఏలేశ్వరం మండలం రూరల్ సోషల్ మీడియా సభ్యులతో గిరిబాబు సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా సోషల్ మీడియా సభ్యులందరూ కృషి చేయాలని, పార్టీని బలోపేతం చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. పార్టీకి నిరంతరం కృషి చేస్తున్న రూరల్ సోషల్ మీడియా కన్వీనర్ కొమ్ముల రాజశేఖర్ ను,గిరిబాబు సాలువాతో సత్కరించారు. సోషల్ మీడియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.